బ్రేకింగ్: అన్‌లాక్ 3.0: మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
By సుభాష్ Published on 29 July 2020 7:48 PM ISTదేశంలో కరోనా వైరస్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్‌లాక్ 2.0 ముగియనున్నందున.. అన్‌లాక్ 3.0కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. ఆగస్టు 31 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మూసే ఉంటాయని స్పష్టం చేసింది.
అలాగే మెట్రో రైళ్లు, సినిమా థియేటర్లు, బార్లకు ఎలాంటి అనుమతి లేదు. ఇక స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులు, ఆడిటోరియంలపై ఆంక్షలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇక దేశ వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఆగస్టు 31 వరకు కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనుంది. కంటైన్‌మెంట్ జోన్ల బయట కార్యకలాపాలపై మార్గనిర్దేశం చేసింది. దేశంలో ఆగస్టు 5వ తేదీ నుంచి జిమ్‌లు తెరుచుకోనున్నాయి.
ఆగస్టు 15 వేడుకలకు మాత్రం వ్యక్తిగత దూరం నిబంధనలతో అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం పేర్కొంది. వందే భారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయి.