నిర్మల్‌: భైంసా అల్లర్లతో అమాయ ప్రజలు రోడ్డున పడ్డారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భైంసా చాలా సున్నితమైన ప్రాంతమని.. పోలీసులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఇటీవల జరిగిన అల్లర్లలో 101 మంది నష్టపోయారని, వారికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం ఇవ్వాలని కోరతామన్నారు. కేంద్రమంత్రిగా నెల జీతాన్ని భైంసా బాధితులకు ఇస్తున్నానని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

భైంసా అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించారు. ఈ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, అర్వింద్‌, సోయం బాపురావు, బీజేపీ నేతలు ఉన్నారు. అల్లర్లు జరిగిన ప్రదేశామైన కోర్భా గల్లీని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని కేంద్రమంత్రి బోరున విలపిస్తూ చెప్పారు. అయితే ఇంత వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా జరిగిన అల్లర్లపై కేంద్రహోంశాఖకు నివేదిక ఇస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. అవసరమైతే సీబీఐ విచారణకు సైతం డిమాండ్‌ చేస్తామన్నారు. మజ్లిస్‌ కుట్రలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇలాంటి వాటిని బీజేపీ సహించదన్నారు. అల్లర్లలో ఇళ్లులు కోల్పోయిన వారికి ఇళ్లులు కట్టి ఇవ్వాలన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.