‘హల్వా వేడుక’లో పాల్గొన్న కేంద్ర మంత్రులు

By రాణి  Published on  20 Jan 2020 10:24 AM GMT
‘హల్వా వేడుక’లో పాల్గొన్న కేంద్ర మంత్రులు

బడ్జెట్ ప్రతుల ముద్రణకు ముందుగా సంప్రదాయంగా నిర్వహించే ‘హల్వా వేడుక’లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాగుర్ సహా ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 2020-21 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన ప్రతులు ముద్రించే ముందు ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌‌లో సంప్రదాయంగా నిర్వహించే ‘హల్వా వేడుక’ సోమవారం జరిగింది.

లోక్‌సభలో ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ..బడ్జెట్ వ్యవహారాల్లో పాల్గొనే అధికారులందరికీ తమ కుటుంబాలతో సహా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇందుకు అధికారిక సూచకంగా ‘హల్వా వేడుక’ నిర్వహిస్తారు. పెద్దకడాయిలో హల్వా వండి ఆర్థిక శాఖ సిబ్బంది మొత్తానికి దీనిని వడ్డిస్తారు. ఈ వేడుక పూర్తి కాగానే బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో ఈసారి జీఎస్టీ శ్లాబ్ రేట్లు పెరగనున్నాయన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story