బిర్యాణి మహిమ... యునెస్కో క్రియేటివ్ న'గరంగా' హైదరాబాద్

By సత్య ప్రియ  Published on  31 Oct 2019 1:15 PM GMT
బిర్యాణి మహిమ... యునెస్కో క్రియేటివ్ నగరంగా హైదరాబాద్

అక్టోబర్ 30, 2019 న యునెస్కో వారు 66 నగరాలను క్రియేటివ్ నగరాలుగా ఎంచుకున్నారు. ప్రపంచం మొత్తంలో 66 నగరాలలో వినూత్న ఆలోచన, విధానలను అవలంభించి పురోగతి సాధిస్తున్నందుకు గానూ ఈ నగరాలను… క్రియేటీవ్ నగరాలుగా వారు ప్రకటించారు.

వీటిలో గ్యాస్ట్రానమీ విభాగంలో హైదరాబాద్ ను ఎంపిక చేయడం జరిగింది. చలనచిత్ర రంగంలో క్రియేటీవ్ నగరంగా ముంబై ఎంపిక అయ్యింది.

రాష్ట్ర మంత్రి శ్రీ కేటి రామా రావు మాట్లాడుతూ "రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, ఆయన బృందం చేసిన సేవలను కొనియాడారు.

హైదరాబాద్ లో రుచికరమైన బిర్యాణి అందించే ఎన్నో స్టార్ ర్యాంక్ గల రెస్టారెంట్లు ఉన్నాయని, ఆహార వ్యవహారాలకి, వారసత్వ సంపద కు ఈ ముత్యాల నగరం ప్రఖ్యాతి చెందిందని రిపొర్ట్ లో ఉంది

Next Story