కిమ్‌ ఆరోగ్యంపై స్పందించిన ఐరాస

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2020 6:18 AM GMT
కిమ్‌ ఆరోగ్యంపై స్పందించిన ఐరాస

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం పై వ‌దంతులు వ‌స్తున్న నేప‌థ్యంలో ఐక్య‌రాజ్య స‌మితి స్పందించింది. ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర‌స్ మాట్లాడుతూ.. కిమ్ ఆరోగ్య ప‌రిస్థితిపై త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని స్ప‌ష్టం చేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్న వార్తల ద్వారానే తమకు ఈ సమాచారం అందిందని, ఈ విష‌యం పై ఐరాస ప్ర‌తినిధులెవ‌రూ ఉత్త‌ర‌కొరియా ప్ర‌భుత్వాన్ని గానీ, ఆదేశ ప్ర‌తినిధుల‌తో గానీ మాట్లాడ‌లేద‌ని చెప్పారు.

కాగా.. ఏప్రిల్ 15న కింగ్ తాత కిమ్ ఇల్ సంగ్ జ‌యంతి వేడుక‌ల‌కు హ‌జ‌రుకాక‌పోవ‌డంతో.. కిమ్ ఆరోగ్యం పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుండె సంబంధిత ఆప‌రేష‌న్ చేస్తుండ‌గా.. ఆయ‌న కోమాలోకి వెళ్లార‌నే వార్త ఒక‌టి ఎక్కువ‌గా వినిపిస్తోంది. అయితే.. ఈ వార్త‌ల‌ను అమెరికాతో పాటు ద‌క్షిణ కొరియా లు తీవ్రంగా ఖండించాయి. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలోనే ఏప్రిల్ 15 నాటి కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాక‌పోయి ఉండ‌వ‌చ్చున‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Next Story