చెట్లెక్కుతున్న భార‌త అంపైర్‌.. ఎందుకంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2020 5:29 AM GMT
చెట్లెక్కుతున్న భార‌త అంపైర్‌.. ఎందుకంటే..?

చెట్టు లెక్క‌గ‌ల‌వా ఓ న‌ర‌హ‌రి.. పుట్ట‌లెక్క‌గ‌ల‌వా.. చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మ‌పై చిగురు కోయ‌గ‌ల‌వా.. అంటూ పాత తెలుగు సినిమా పాట ఉంది. అచ్చం అలాగే ఉంది ఆ అంఫైర్ ప‌రిస్థితి. మ్యాచ్ ర‌ద్దు అయ్యింది గ‌దా అని సొంతూరు చూద్దామ‌ని వెళ్లాడు అక్క‌డికి వెళ్లాడ లాక్‌డౌన్ విధించ‌డంతో చిక్కుకుపోయాడు. త‌న ఇంట్లో వాళ్ల‌కి ఫోన్ చేద్దామంటే.. సెల్‌పోన్‌లో సిగ్న‌ల్ లేదు. దీంతో.. ఆ ఊరిలో ఉన్న చెట్లు అన్ని ఎక్కుతూ సిగ్న‌ల్ ఎక్క‌డ దొరుకుతుందా అని తెగ వెతికేస్తున్నాడట‌.

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌డంతో.. భార‌త, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రగాల్సిన వ‌న్డే సిరీస్‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఐసీసీ అంత‌ర్జాతీయ ప్యానెల్ అంపైర్ అనిల్ చౌద‌రి త‌న పూర్వీకుల గ్రామం చూడ‌డానికి మార్చి 16న ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ష‌మిల్ జిల్లాలోని దాంగ్రోల్‌కు వెళ్లాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ను విధించారు. దీంతో అనిల్ ఆ ఊరిలో చిక్కుకుపోయాడు. ప్ర‌స్తుతం ఐసీసీ అంఫైర్ల‌కు ఆన్‌లైన్ ప్రోగామ్స్ నిర్వ‌హిస్తోంది. వాటికి ఈ భార‌త అంఫైర్ త‌ప్ప‌క హాజ‌రుకావాలి. అయితే.. సెల్‌ఫోన్‌లో సిగ్న‌ల్ లేవు. ఆ ఊరిలో ఎక్క‌డా రావ‌డం లేదు. ఈ విష‌యాన్ని ఓ వార్తా సంస్థ‌కు వెల్ల‌డించాడు.

ఓ వారం రోజులు ఇక్క‌డ ఉందామ‌ని నా ఇద్ద‌రు కొడుకుల‌తో ఇక్క‌డికి వ‌చ్చాను. సరిగ్గా ఇదే సమ‌యంలో ప్ర‌ధాని దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ విధించారు. దీంతో నేను, నా కుమారులు ఇక్క‌డే ఉండి పోవాల్సి వ‌చ్చింది. నా భార్య‌, అమ్మ ఢిల్లీలో ఉన్నారు. వారితో సెల్‌ఫోన్‌లో మాట్లాడ‌లేని ప‌రిస్థితి ఉంది. ఇక్క‌డ మొబైల్ నెట్ వ‌ర్క్ స‌రిగ్గా లేదు. ఇంట‌ర్నెట్ అస‌లే రాదు. సిగ్న‌ల్ కోసం ఊరి బ‌య‌ట‌కు వెళ్లాలి. లేదంటే చెట్లు ఎక్కాల‌ని తెలిపాడు. పోని అలా చేసిన ఎక్కువ సంద‌ర్భాల‌లో సిగ్న‌ల్ ఉండ‌డం లేద‌న్నాడు. డిల్లీ నుంచి ఈ ఊరు 85 కిమి దూరంలో ఉన్నా.. ఈ స‌మ‌స్య ఉండ‌డం గ‌మ‌నార్హం. స‌మ‌స్య గురించి అధికారుల‌కు ఫిర్యాదు చేసి.. 10 రోజులు ధాటింది. అయిన‌ప్ప‌టికి అధికారుల నుంచి ఎటువంటి స‌మాధానం లేదు. ప్ర‌స్తుతం తాను గ్రామ‌స్తులంద‌రి మ‌హ‌మ్మారి కరోనా వైర‌స్ పై అవ‌గాహాన క‌ల్పిస్తున్నాన‌ని అన్నాడు.

Next Story
Share it