దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ కూడా చివ‌ర్లో చెల‌రేగాడు. జడేజా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. జార్జ్‌ లిండే వేసిన 112 ఓవర్‌ ఐదు, ఆరు బంతుల్ని సిక్సర్లుగా బాదిన‌ ఉమేశ్‌.. లిండే వేసిన 114 ఓవర్‌ తొలి బంతిని సిక్స్‌గా కొట్టాడు. ఆపై మూడో బంతిని కూడా సిక్స్‌గా మలచగా, ఐదో బంతిని సైతం సిక్స్‌ కొట్టాడు. మళ్లీ భారీ షాట్ ఆడ‌బోయి ఆ ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. 10 బంతుల్లో ఓవరాల్‌గా ఐదు సిక్సర్లు కొట్టిన ఉమేశ్‌(31) తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు.

అంతకుముందు.. భార‌త ఇన్నింగ్స్ లో రోహిత్‌ శర్మ(212), రహానే(115)లు ఆకట్టుకోగా.. జడేజా అర్థ శతకంతో మెరిశాడు. అయితే భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 497/9వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఆపై ఇన్నింగ్స్ ప్రారంభించిన స‌ఫారీలు.. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

2 comments on "‘సిక్స‌ర్ల’ మోత మోగించిన ఉమేష్.. స‌ఫారీల ల‌క్ష్య‌మెంతంటే.?!"

Comments are closed.