'సైరా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..! ఇంతకీ...రిజల్ట్ ఏంటి..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Sept 2019 11:53 AM ISTమెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'సైరా నరసింహారెడ్డి'. ఈ భారీ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించారు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు ప్రధాన పాత్రలలో నటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న 'సైరా' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ... అంచనాలు మరింత పెరుగుతున్నాయి. మరో వైపు అభిమానుల్లో టెన్షన్ పెరుగుతోంది. సైరా సినిమాని సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... సైరా సినిమా పై అప్పుడే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదేంటి... అక్టోబర్ 2న కదా.. సినిమా రిలీజ్. అప్పుడే ఫస్ట్ రివ్యూ రావడం ఏంటి ? అనుకుంటున్నారా..? మేటర్ ఏంటంటే... యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు భారీ చిత్రాల రిలీజ్ కి రెండు మూడు రోజుల ముందే తన రివ్యూ ఇచ్చేస్తుంటాడు.
ఇంతకీ సైరా గురించి ఉమైర్ సంధు ఏం చెప్పారంటే... సైరా సినిమా చూశాకా నోట మాట రాలేదు. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బష్టర్ హిట్. ఇక చిరంజీవి నటనకు నేషనల్ అవార్డ్ వస్తుంది. లైఫ్ టైమ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ 'సైరా' సినిమాని ఆకాశానికి ఎత్తేసాడు. ఉమైర్ సంధు రిపోర్ట్ ఎంత వరకు కరెక్ట్ అనేది అక్టోబర్ 2న తెలుస్తుంది.