Ugadi 2023: తెలుగు సంవత్సరాలు, నెలల గురించి మీకు తెలుసా?
ఉగాది.. ఈ పండుగతోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ప్రతి తెలుగు సంవత్సరానికి కూడా ఒక పేరు
By అంజి Published on 19 March 2023 3:15 PM ISTUgadi 2023: తెలుగు సంవత్సరాలు, నెలల గురించి మీకు తెలుసా?
ఉగాది.. ఈ పండుగతోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ప్రతి తెలుగు సంవత్సరానికి కూడా ఒక పేరు ఉంటుంది. ఈసారి ఉగాది ఈ ఏడాది మార్చి 22 బుధవారం వచ్చింది. ఈ కొత్త సంవత్సరం పేరు శ్రీ శోభకృత్. ఈ రోజును సృష్టి మొదలు అయిన రోజుగా చెబుతారు. అందుకే సృష్టికి మూలకారకుడైన బ్రహ్మని పూజించి తమ జీవితంలో అన్ని రుచులూ ఉండాలని కోరుతూ షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవిస్తారు. తెలుగు సంవత్సరాలకి 60 పేర్లు ఉన్నాయి. కాలచక్రము 60 సంవత్సరాలు పూర్తి అయితే.. మరల కొత్త సంవత్సరము మొదటి సంవత్సరము పేరుతో మొదలవుతుంది.
తెలుగు సంవత్సరాల పేర్ల వెనక కథ:
ఓ సారి నారదమహాముని శ్రీమహావిష్ణువు దేవుడి మాయ వల్ల స్త్రీగా మారుతాడు. ఆ తర్వాత ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. అయితే ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో అందరూ చనిపోతారు. అప్పుడు నారదుడి ప్రార్థనకు విష్ణువు కరుణించి.. 'నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు' అని వరం ఇస్తాడు. కాగా ఆ పిల్లల పేర్లే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని ఓ కథ ప్రచారంలో ఉంది.
తెలుగు సంవత్సరాల పేర్లు:
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
ఇంగ్లీష్ సంవత్సరంలో మాదిరిగానే.. తెలుగులో కూడా మొత్తం 12 నెలలు ఉంటాయి. ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లుగా చెబుతుంటారు. ఇక ప్రతి నెలలో 30 రోజులు ఉంటాయి. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమితో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
తెలుగు నెలలు
1. చైత్రము
2. వైశాఖము
3. జ్యేష్ఠము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వీయుజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము