ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ వ‌స్తుందా..?

By అంజి  Published on  25 Nov 2019 3:39 PM GMT
ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ వ‌స్తుందా..?

ప్ర‌జెంట్.. అటు బాలీవుడ్‌లోను, ఇటు టాలీవుడ్‌లోను బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. అందుక‌నే హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు బ‌యోపిక్‌లపై ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. తెలుగులో ఇటీవ‌ల‌ ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు, సావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టి, జార్జిరెడ్డి... వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా యువ సంచ‌ల‌నం ఉద‌య‌కిర‌ణ్ బ‌యోపిక్ తెర పైకి రానుందని వార్త‌లు వ‌స్తున్నాయి.

అవును... చిత్రం సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై.. తొలి చిత్రంతోనే సంచ‌ల‌నం సృష్టించి.. తొలి మూడు చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి హ్యాట్రిక్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు ఉద‌య్ కిర‌ణ్. సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చి హీరోగా స‌క్స‌స్ సాధించి.. ఆత‌ర్వాత అవ‌కాశాలు రాక ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాడు. ఆత‌ర్వాత ఉద‌య్ కిర‌ణ్ జీవితంలో ఏం జ‌రిగిందో తెలిసిందే.

ఒత్తిడి త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. ఈ బ‌యోపిక్ లో ఉద‌య్ కిర‌ణ్ పాత్ర‌ను యువ హీరో సందీప్ కిష‌న్ పోషించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ట‌. ఎన్నారైతో క‌లిసి సందీప్ కిష‌న్ ఈ సినిమాని నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై సందీప్ కిష‌న్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

Next Story
Share it