ఉబర్ 'బస్సులు' వస్తున్నాయ్.! రెడీనా.!
By Medi SamratPublished on : 23 Oct 2019 1:21 PM IST

ప్రముఖ ఆన్‌లైన్ రైడ్ హైలింగ్ సంస్థ ఉబర్.. త్వరలోనే బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. ఈ మేరకు ఉబర్ దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ప్రయోగాత్మకంగా ఈ సేవను ప్రారంభించింది. వినియోగదారుల నుంచి స్పందన చూసిన తర్వాత.. పూర్తి స్థాయిలో ఉబర్ యాప్ లో ఏసీ బస్సులను బుక్ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది.
ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతం అయితే... అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఉబర్ బస్ సీటు బుకింగ్ సేవలను విస్తరించే దిశగా సంస్థ ఏర్పాట్లు చేయనుంది. ఇప్పటికే ఇలాంటి సర్వీస్ ను ఉబర్ ఈజిప్ట్ రాజధాని కైరో లో గతేడాది అక్టోబర్ లో ప్రవేశ పెట్టింది. మరి మన దేశంలో ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి మరి.
Next Story