రెండు కార్ల నిండా డాక్యుమెంట్లు.. ఏం చేశారంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2019 1:02 PM GMT
రెండు కార్ల నిండా డాక్యుమెంట్లు.. ఏం చేశారంటే..

రంగారెడ్డి : జిల్లా కేంద్రంలోని శంషాబాద్ మండలం రాల్లగూడలో కొంద‌రు వ్య‌క్తులు అనుమాన‌స్ప‌దంగా వ్య‌వ‌హ‌రించారు. వివ‌రాళ్లోకెళితే.. గుర్తుతెలియ‌ని ఆరుగురు వ్య‌క్తులు రెండు వాహనాలలో విలువైన డాక్యుమెంట్లు తీసుకువచ్చి తగలబెట్టే ప్రయత్నం చేశారు. స్థానికులకు అనుమానం రావ‌డంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంట‌నే సంఘటనా స్థలానికి చేరుకున్న‌ పోలీసులు.. వారిని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రెండు వాహనాలతో పాటు ఆరుగురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలావుంటే.. ఆ డాక్యుమెంట్స్.. టర్బో ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించినవి స‌మాచారం.

Next Story