రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళలకు నోబెల్ పురస్కారం
By సుభాష్
రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళలకు నోబెల్ పురస్కారం వరించింది. జీనోమ్ ఎడిటింగ్ విధానంలో చేసిన పరిశోధనకు గానూ ఇమ్మాన్యుయెల్ చార్పెంటీర్, జెన్సీఫర్ ఏ డౌడ్నాకు ఈ ఏడాది ఈ పురస్కారం లభించింది. కాగా, ఇప్పటికే వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించగా, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి, సోమవారం ఆర్థిక శాస్త్రం విభాగంలో విజేతలను ప్రకటించనున్నారు.
కాగా, ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని గత సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. హెపటైటిస్ సీ వైరస్ ఆవిష్కరణకు గాను అమెరికాకు చెందిన హార్వే జే ఆల్టర్,చార్లెస్ ఎమ్ రైస్, బ్రిటన్‌కు చెందిన మైఖేల్ హౌఘ్టన్ 2020 నోబెల్ బహుమతిని సంయుక్తంగా సాధించుకున్నారు. స్టాక్‌హోమ్‌లో సోమవారం కరోలినా ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరి పేర్లను నోబెల్ బహుమతి కమిటీ వెల్లడించింది. హెపటైటిస్ సీ వైరస్ పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ నోబెల్ దక్కడం వారికి ఇది ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో సిరోసిస్, కాలేయ సంబంధ క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రధాన ఆరోగ్య సమస్య అయిన రక్తం ద్వారా కలిగే హెపటైటిస్‌కు వ్యతిరేకంగా పోరాటంలో సహకారం అందించిన ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు అని నోబెల్ బహుమతి కమిటీ ప్రశంసించింది.
హార్వే జె ఆల్టర్, మైఖేల్ హౌఘ్టన్, చార్లెస్ ఎమ్ రైస్ సెమినల్ ఆవిష్కరణలు చేశారు. ఇది హెపటైటిస్ సీ వైరస్ అనే వైరస్ గుర్తింపునకు దారి తీస్తుంది. హెపటైటిస్ సీ వైరస్ యొక్క ఆవిష్కరణ దీర్ఘకాలిక హెపటైటిస్ కేసులకు కారణాన్ని వెల్లడించింది అని నోబెల్‌కమిటీ తెలిపింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా హెపటైటిస్ కేసులు నమోదు అవుతుండగా,ఏటా 4,00,00 మంది దీని కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఈ దీర్ఘకాలిక కాలేయంలో మంట, క్యాన్సర్‌కు ప్రధాన కారణమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇక విజేతలకు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్లతో పాటు బంగారు పతకం అందజేస్తారు. భౌతిక, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రాల్లో కూడా నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. వీటిని ఈనెల12న ప్రకటించనున్నారు.