కామారెడ్డిలో జంట హత్యలు కలకలం

By సుభాష్  Published on  26 Jun 2020 4:16 AM GMT
కామారెడ్డిలో జంట హత్యలు కలకలం

కామారెడ్డిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గుమస్తా కాలనీ శివారులో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వడ్ల సుధాకర్‌ (46), కోయల లక్ష్మయ్య (62)లను గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో దారుణంగా కొట్టి హతమార్చారు. కాగా, సుధాకర్‌ బీడీ కాలనీలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పని చేస్తుంగా, కోయల లక్ష్మయ్య హమాలీగా పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిరిశీలించారు.

అయితే వ్యక్తిగత వివాదాలతోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ జంట హత్యలకు పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story
Share it