ఇద్దరి ప్రాణాలుతీసిన 'కరోనా'తాడు!

By Newsmeter.Network  Published on  28 March 2020 6:01 AM GMT
ఇద్దరి ప్రాణాలుతీసిన కరోనాతాడు!

కరోనా వైరస్‌ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఇండ్ల నుంచి బయటకు వచ్చిన వారిపై పోలీసులు తమ ప్రతాపం చూపుతున్నారు. దీంతో నిత్యావసర వస్తువులు అవసరం ఉన్నా కొందరు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎక్కడికక్కడ రహదారులను మూసివేశారు. ఇప్పటికే పలువురు పోలీసులు కారణం లేకుండా కొడుతున్నారంటూ.. అసలు తాము బయటకు ఎందుకు వచ్చామో తెలుసుకోకుండా కొడుతున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా పోలీసుల అత్యుత్సాహంతో ఓ వ్యక్తి ఏకంగా మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి మీద రాకపోకలు బంద్‌ చేశారు. బ్రిడ్జి ప్రారంభం లో అడ్డు వేయకుండా.. 99ఎల్‌ పోల్‌ వద్ద కనపడకుండా పోలీసులు రోప్‌ కట్టారు.

Also Read :లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌.. కండోమ్‌లకు యమ గిరాకీ!

రాజేంద్ర మహేంద్రవరంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఆర్‌. రాజశేఖర్‌ తన విధులను ముగించుకొని రాత్రివేళ ఇంటికి బయలు దేరారు. అసలే కర్ఫ్యూ వాతావరణం ఉంది. రోడ్డుపై ఒక్కరుకూడా కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో బ్రిడ్జిపై గుండా వెళ్తున్నారు. బ్రిడ్జి పై 99ఎల్‌ వద్ద పోలీసులు కనపడకుండా కట్టిన రోప్‌ను వేగంగా వెళ్లి తగిలాడు. దీంతో ద్విచక్ర వాహనం ఒక్కసారిగా కిందపడటంతో పాటు రాజశేఖర్‌ కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందాడు. దీంతో స్థానికులు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read :కొందరు పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారా?

పోలీసుల అవగాహన లోపం వల్ల వ్యక్తి మృతికి కారణమయ్యారని ఆరోపిస్తున్నారు. హెచ్చరిక బోర్డులు లేకుండా ఇలా రోప్‌ ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు. కొందరు పోలీసులు కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని కనీసం 108 వాహనాలకు కూడా అనుమతి నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మీడియా రాకతో హుటాహుటీన పోలీసులు రోప్‌ను తొలగించడం గమనార్హం. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలువురి పోలీసుల అత్యుత్సాహంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే బ్రిడ్జిపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా రోప్‌ కట్టి వ్యక్తి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

Also Read : కరోనా ఆట కట్టించిన దేశం ఏదంటే..

ఇదిలా ఉంటే ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో.. మా గ్రామంలోకి ఇతరులెవరూ రావొద్దంటూ రోడ్డుకు అడ్డంగా కట్టిన తాడు ఓ వ్యక్తికి మృత్యుతాడుగా మారింది. బాపట్ల మండలం పూండ్ల వద్ద రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. అయితే ఆ తాడును చూసుకోకుండా కూనపురెడ్డి సుబ్బారావు బైక్‌పై వెళ్లగా కిందపడిపోయాడు. ఆ సమయంలో తాడు అతని మెడకు చెట్టుకొని ఉరి బిగుసుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బాపట్ల మండలం కొండుబొట్ల వారిపాలెం వాసిగా పోలీసులు గుర్తించారు.

Next Story