విషాదం: చికెన్‌లో మసాలకు బదులు విషం గుళికలు.. ఇద్దరు చిన్నారులు మృతి

By సుభాష్  Published on  23 Jun 2020 5:33 AM GMT
విషాదం: చికెన్‌లో మసాలకు బదులు విషం గుళికలు.. ఇద్దరు చిన్నారులు మృతి

ఓ వృద్ధురాలు మతిమరుపే ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. మసాలా అనుకుని చికెన్‌లో విష గుళికలు వేయడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇద్దరు మనవళ్లు చాలా రోజుల తర్వాత అమ్మమ్మ ఇంటికి వచ్చారు. అయితే ఇంటికి మనవళ్లు వచ్చారనే ఆనందంలో అమ్మమ్మ చికెన్‌ తీసుకొచ్చింది. చికెన్‌ వండే సమయంలో మసాలకు బదులు గుళికలు వేయడంతో చికెన్‌ తిన్న ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలోని రూరల్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఇద్దరు పిల్లలు సెలవులు కావడంతో ఏఎల్‌ పురంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఇక మనవళ్లు వచ్చారనే సంతోషంతో అమ్మమ్మ చికెన్‌ వండి పెట్టింది.

అయితే చికెన్‌ వండే సమయంలో మసాలాకు బదులుగా పొరపటున ఏకంగా పురుగుల మందుకు సంబంధించిన గుళికలను వేసింది. దీంతో చికెన్‌లో మొత్తం విషంగా మారిపోయింది. చికెన్‌ తిన్న ఇద్దరు చిన్నారులు మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పిల్లల అమ్మమ్మకు మతిమరుపు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Next Story
Share it