ట్విట్టర్ సీఈఓ భారీ విరాళం

By రాణి  Published on  9 April 2020 5:57 AM GMT
ట్విట్టర్ సీఈఓ భారీ విరాళం

కరోనా వైరస్ రక్కసిపై పోరాటానికి ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ భూరి విరాళాన్ని ప్రకటించారు. తన సంపాదనలో 28 శాతాన్ని విరాళమివ్వనున్నారు. 1 బిలియన్ డాలర్లు అంటే..ఇండియా కరెన్సీలో రూ.7600 కోట్ల విరాళాన్ని ఇవ్వనున్నారు జాక్ డోర్సీ. ప్రతి 65 సెకండ్లకు కోటి 35 లక్షల మంది ట్విట్టర్ ను వినియోగిస్తున్నారు. ప్రపంచంలో కరోనా విలయతాండవాన్ని ఆపేందుకు అపర కుబేరులంతా కదిలి వస్తున్నారు. అంతకుముందు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కూడా కరోనాపై పోరాడేందుకు భారీ విరాళమిచ్చారు. ఇక టాటా గ్రూప్ కూడా రూ.1500 కోట్ల విరాళమిచ్చింది. అందరికన్నా ముందు అధిక విరాళమిచ్చిన సంస్థ టాటా గ్రూపే.

Also Read : అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

కాగా..తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ మొత్తంలో విరాళాలందుతున్నాయి. ఆయిల్ సంస్థలు, స్టీల్, సింగరేణి, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ సంస్థలు, వివిధ శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండు తెలుగు రాష్ట్రాలకు తమకు తోచిన విరాళాలను అందజేస్తున్నారు. సినీ కార్మికుల కోసం స్థాపించిన సీసీసీ కి కూడా పలువురు సినీ ప్రముఖులు చేయూతనందిస్తున్నారు. అలాగే లాక్ డౌన్ కారణంగా ఆహారం లేని కుటుంబాలకు నిత్యావసరాలను, ఆహారాన్ని అందజేస్తున్నారు టాలీవుడ్ నటులు.

Next Story