ప్రాణం తీసిన టీవీ..
By Newsmeter.Network Published on 23 Feb 2020 2:14 PM IST
కుటుంబ సభ్యులతో కలిసి టీవీ సిరీయల్ చూస్తుంది ఓ మహిళ. వినోదాన్ని పంచే టీవీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆ మహిళ భర్త, ఆరు నెలల వయస్సు ఉన్న పాప తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
సుందర్‌గఢ్ జిల్లా దురువ ఠాణా లహండబుడ గ్రామంలో చెందిన ఢిల్లేశ్వర నాయక్, బాబినాయక్(30) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఆరు నెలల క్రితం ఓ పాప పుట్టింది. కాగా శుక్రవారం రాత్రి ఆ దంపతులు తమ చిన్నారిని ఒడిలో పడుకోబెట్టుకుని టీవీలో సీరియల్స్ చూస్తున్నారు. అంతలో ఒక్కసారీగా టీవీ భారీ శబ్ధం చేస్తుకుంటూ టీవీ పేలిపోయింది. దీంతో వారు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.
భారీ శబ్దంతో టీవీ పేలడంతో స్థానికులు దానిని బాంబు పేలుడుగా భావించారు. ఢిల్లేశ్వర నాయక్ ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావడంతో లోనికి వెళ్లి చూడగా దంపతులిద్దరూ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో సుందర్‌గడ్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాబినాయక్ ఆస్పత్రిలో చనిపోగా.. తీవ్రంగా గాయపడిన ఢిల్లేశ్వరనాయక్, చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే టీవీ పేలినట్లుగా భావిస్తున్నారు.