రోగ నిరోధక శక్తి పెంచే పసుపుతో ప్రయోజనాలెన్నో..
By సుభాష్ Published on 3 April 2020 1:08 PM GMTపసుపు సహజ సిద్దమైన యాంటీ బయాటిక్‌గా పని చేస్తుంది. కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో పసుపు ఎంతో పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థం యాంటీ ఇన్‌ప్లమేరిటీ, యాంటీ ఆక్సిండెంట్‌తో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. పసుపును నీళ్లల్లో కలుపుకొని క్రమం తప్పకుండా తాగినట్లయితే టైప్ -2 డయాబెటిస్ నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పసుపులో ఉండే కుర్కుమిన్ హర్మోన్లను క్రమపద్దతిలో ఉంచి, మతిమరుపును నివారిస్తుంది. అలాగే పసుపులో యాంటీ ఆక్సిండెంట్ గుణాలు గుండెకు సంబంధించిన వ్యాధులను రానివ్వకుండా ఉపయోగపడుతుంది. అంతేకాదు మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. అలాగే క్యాన్సర్‌కు సంబంధించిన ట్యూమర్ల పెరుగుదల, కణాల విస్తరణను పసుపు అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పసుపులో చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే అమెరికాకు చెందిన ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో పసుపు ఔషద గుణాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పసుపు తాత్కాలిక ఆరోగ్య సమస్యల నుంచే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది.