సిరియాలోని ఈశాన్య ప్రాంతాలపై టర్కీ రెండో రోజు కూడా వైమానిక దాడులు చేసింది. కుర్దుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై బుధవారం టర్కీ మరోసారి బాంబుల వర్షం కురిపించింది. కాగా దాడిలో మహిళలు, పిల్లలు సహా 50 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడుల్లో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. 64 వేల మంది కుర్దులు తమ ఇళ్లు, గ్రామాలను విడిచి పారిపోతున్నారు. అయితే తాము అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు టర్కీ ప్రకటించింది. మరోవైపు సిరియాపై టర్కీ చేస్తున్న బాంబు దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీ చర్యల వల్ల అక్కడి స్థానికలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని టర్కీకి భారత్ హితవు పలికింది. సిరియా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, సంయమనం పాటించాలని భాతర విదేశాంగ శాఖ సూచించింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.