బిత్తిరి సత్తి 'తుపాకీ రాముడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశేషాలు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 9:33 AM GMT
బిత్తిరి సత్తి తుపాకీ రాముడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశేషాలు..

బిత్తిరి స‌త్తి, ప్రియ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'తుపాకీ రాముడు'. ర‌స‌మ‌యి ఫిలింస్ ప‌తాకంపై టి.ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 25న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు, సినిమాటోగ్ర‌ఫీ మినిస్టర్ తల‌సాని శ్రీనివాస‌యాద‌వ్, ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. మంచి ప్రయత్నం చేశారు. 'తుపాకీరాముడు' అక్టోబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది. అయితే గత రెండు నెల‌లుగా న‌న్నెంతగానో ఇబ్బంది పెట్టాడు. ఈ రోజుల్లో సినిమాను అంద‌రూ తీసేస్తున్నారు. కానీ ప్రేక్ష‌కుల ద్వారా డ‌బ్బులు వ‌చ్చేలా సినిమా తీస్తేనే అంద‌రికీ మంచింది. కానీ ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

బిత్తిరి స‌త్తి మాట్లాడుతూ.. నన్ను న‌మ్మి ఇంత ఖ‌ర్చు పెట్టి సినిమాను చేసిన ర‌స‌మ‌యి గారికి కృత‌జ్ఞ‌తలు. క‌రీంన‌గ‌ర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. క‌రీంన‌గ‌ర్‌లో వివేక్ సార్.. వీ6 ఛానెల్ ద్వారా పెద్ద యాంక‌ర్‌ను చేశారు. అలాగే అదే జిల్లాకు చెందిన ర‌స‌మ‌యి అన్న నన్ను హీరోను చేశారు. దిల్ సినిమాకు ఆడిష‌న్‌కు వెళ్లిన‌ప్పుడు నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దిల్‌రాజుగారే నా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నేను ఈ రోజు ప్రేక్ష‌కుల‌కు గుర్తున్నానంటే కార‌ణం.. మా ఊర్లో మా ఇంటి ప‌క్క‌నుండే ముకుంద రెడ్డిగారు ఇచ్చిన బిత్తిరి స‌త్తి పేరే. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్‌.శంక‌ర్‌, క‌ర్నె ప్ర‌భాక‌ర్‌, యాద‌న్న‌, హీరోయిన్ ప్రియ, సుమ‌, రాజ్‌త‌రుణ్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Next Story
Share it