నిబంధనలకు విరుద్ధంగా తితిదేలో ప్రైవేటు యాగం

By అంజి  Published on  30 Nov 2019 8:11 AM GMT
నిబంధనలకు విరుద్ధంగా తితిదేలో ప్రైవేటు యాగం

తిరుమల తిరుపతి లో వ్యక్తిగత హోమాలు పూర్తిగా నిషేధం. కానీ రహస్యంగా శుక్రవారం కపిల తీర్థంలోని గుడిలో ఒక టీటీడీ బోర్డు సభ్యుడి అత్తా మామల షష్ఠిపూర్తి సందర్భంగా రుద్ర హోమ జపం జరిగిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో మరో సారి తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరుపై, పోకడలపై ప్రశ్నచిహ్నాలు తలెత్తుతున్నాయి.

టీటీడీ బోర్డు సభ్యుడు కృష్ణమూర్తి వైద్యనాథన్ కోసం అరవై మంది ఋత్విక్కులతో తన అత్తా మామల షష్టిపూర్తి సందర్భంగా రహస్య యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో సహా, ఎవరినీ యాగస్థలానికి అనుమతించలేదు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది యాగస్థానాన్ని కాపలా కాశారు. టీటీడీ బోర్డు సభ్యుడు, ఆయన కుటుంబ సభ్యులు తప్ప మరెవరినీ లోపలికి అనుమతించలేదు. ఈ యాగం కపిలతీర్థంలోని ఆంజనేయ స్వామి మందిరం ముందు జరిగింది. దీనికి అనుమతి ఎవరిచ్చారన్నది తెలియరాలేదు. అయితే నిబంధనల మేరకే అనుమతినిచ్చామని, ఇది వ్యక్తిగత హోమం కాదని, యాగ స్థలంలోకి ఇతరుల ప్రవేశాన్ని అడ్డుకోలేదని అధికారులు అంటున్నారు. ఇది సమస్త మానవాళి సంక్షేమం కోసం తలపెట్టిన హోమం అని కూడా అధికారులు చెబుతున్నారు.

Next Story