ఆర్టీసీ కార్మికుల అరెస్ట్.. అందుకే..!
By Medi Samrat Published on 11 Oct 2019 8:36 AM GMTహైదరాబాద్: లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరుగురు ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సులను నడుపుతోంది. కాగా, ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడంలేదన్న కోపంతో మెహదీపట్నం డిపోకు చెందిన ఆరుగురు కార్మికులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.
ఈ నెల 9న జరిగిన బస్సు అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఆరుగురు ఆర్టీసీ కార్మికులను లంగర్‌హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు ఆర్టీసీ కార్మికులపై ఐపీసీ సెక్షన్ 341, 427 పీడీపీపీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వారం రోజులకు చేరుకుంది. సమ్మెను తీవ్ర తరం చేసే దిశగా కార్మిక సంఘాల నేతలు ప్రణాళికను రూపొందిస్తున్నారు.
Next Story