అశ్వత్థామరెడ్డికి షాకిచ్చిన తెలంగాణ ఆర్టీసీ
By సుభాష్ Published on 5 Jan 2020 1:53 PM ISTతెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. అదనపు సాధారణ సెలవులను మంజూరు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించింది. ఆరు నెలల సెలవులు కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును ఆర్టీసీ యాజమాన్యం తిరస్కరించింది. పైగా తక్షణమే విధుల్లోచేరాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ విధులకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
కాగా, ఇటీవల ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో అశ్వత్థామరెడ్డి కీలక పాత్ర పోషించారు. 50 రోజులకుపైగా కొనసాగిన సమ్మె..ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపడంతో సమ్మెను విరమించారు. అనంతరం వెంటనే విధుల్లో చేరారు. కాగా, అశ్వత్థామరెడ్డి విధుల్లో చేరకుండా తనకు ఆరు నెలల పాటు సెలవు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా, అన్ని రోజులు సెలవులు ఇవ్వలేమని ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ తేల్చి చెప్పింది. కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడానికి కారణం అశ్వత్థామరెడ్డియే కారణమని ప్రభుత్వం కూడా మండిపడింది. మరో వైపు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సెలవు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది యాజమాన్యం.