కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణం
By Medi Samrat
ముఖ్యాంశాలు
- 15 నుండి 19 వరకు నూతన ఉద్యమ కార్యచరణ
- 19న హైదరాబాద్ టు కోదాడ సడక్ బంద్
కార్మికులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కనీసం పరామర్శించిన దాఖలాలు లేవని.. 23మంది ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణమని ఫైర్ అయ్యారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకా శాన్ని కోల్పోవలసి వస్తుందని.. ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజువవుతోందని అన్నారు.
ఈ మేరకు 15 నుండి 19 వరకు నూతన ఉద్యమ కార్యచరణను రూపొందించింది. 15న గ్రామ గ్రామాన బైక్ ర్యాలీ, 16న సామూహిక దీక్ష, అన్ని డిపోల నుండి బైక్ ర్యాలీ.. 17, 18న అన్ని డిపోల ముందు సామూహిక దీక్షలు, 19న హైదరాబాద్ టు కోదాడ సడక్ బంద్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరారు. సడక్ బంద్ కార్యక్రమానికి మద్దతు కోసం కేంద్ర హోం శాఖసహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసామని.. ఆయన మా కార్యక్రమాలన్నింటినీ మద్దతు పలికారని అన్నారు.