హైద‌రాబాద్ : ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు బీజేపీ పూర్తి సంఘీభావం తెలుపుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్మా ప్రయోగిస్తాం, ఉద్యోగాల నుండి తొలగిస్తాం అంటూ బెదిరించడం సరైంది కాదని అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమం చేసిందే ఆర్టీసీ కార్మికులేన‌ని గుర్తుచేశారు. పండుగ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన‌ని అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒకటి రెండు రోజులు చేయొచ్చు.. కానీ వారికి శాశ్వత పరిష్కారం కావాలి లక్ష్మణ్ అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.