ఆగిన మ‌రో ఆర్టీసీ కార్మికుని గుండె.. ప‌రిగి డిపో వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త‌.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Nov 2019 7:02 AM GMT
ఆగిన మ‌రో ఆర్టీసీ కార్మికుని గుండె.. ప‌రిగి డిపో వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త‌.!

వికారాబాద్ : జిల్లా కేంద్రంలోని పరిగి ఆర్టీసీ డిపో వ‌ద్ద తీవ్ర‌ ఉద్రిక్తత చోటుచేసుకుంది. స‌మ్మెపై ప్ర‌భుత్వం ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో మనో వేదనతో ఆర్టీసీ డ్రైవర్ వీర భద్రయ్య మరణించాడు. కాగా, వీర భ‌ద్ర‌య్య మ‌ర‌ణంతో కోపోద్రిక్తులైన తోటి కార్మికులు శవంతో డిపోలోకి చొచ్చుకు వచ్చి బైటాయించారు. కార్మికుల ప్ర‌య‌త్నాన్ని పోలీసులు అడ్డ‌కునేందుకు ప్ర‌య‌త్నించడంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

Next Story
Share it