వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC

By రాణి  Published on  11 March 2020 12:20 PM IST
వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC

ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి టీఎస్ పీఎస్ సీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSB ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 93 ఖాళీలు ఉండటంతో..తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌ మేనేజర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read : ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్‌ ఉంటే చాలు

మార్చి 16వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవ్వనుంది. మార్చి 30వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చని TSPSC బోర్డు వెల్లడించింది.

మొత్తం పోస్టుల ఖాళీల వివరాలిలా ఉన్నాయి

మేనేజర్ (సివిల్ )- 79

మేనేజర్ (మెకానికల్ )- 06

మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 04

మేనేజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)- 03

మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)- 01

ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు..ఆ పోస్టు తగిన విద్యార్హతను కలిగి ఉండాలి. అలాగే 2020 జూలై 1వ తేదీకి 18-34 ఏళ్ల వయసు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు కోసం రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పరీక్షలు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో జరుగుతాయి.

For Notification Click Here

Next Story