తెలంగాణలో మాల్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లు ఓపెన్‌

By సుభాష్  Published on  5 Jun 2020 10:07 AM GMT
తెలంగాణలో మాల్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లు ఓపెన్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో ఐదో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక లాక్ డౌన్ 5.0 లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీ నుంచి తెలంగాణలోని కంటైన్మెంట్‌ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు, ప్రార్థనమందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. (ఇది చదవండి: తెలంగాణ ఆర్టీఏ కీలక నిర్ణయం.. ఇక ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే సేవలు)

కంటైన్‌మెంట్‌జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. రాత్రి సమయాల్లో కర్ఫ్యూ యధివిధిగా ఉంటుందని తెలిపింది. కాగా, ప్రజలందరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. అలాగే ఆలయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్‌లలో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని, ప్రతీ చోట ‌హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సూచించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుందని, ఆస్పత్రులు, ఫార్మసీలు మినహా షాపులన్నీ రాత్రి 8.30 తర్వాత మూసి ఉంచాలని స్పష్టం చేసింది. ఇక 65ఏళ్లుపైబడిన వారు 10 సంవత్సరాల్లోపు పిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని సూచించింది. (ఇది చదవండి: దేశంలోనే రెండో స్థానం: తెలంగాణలో 55 రకాల కరోనా వైరస్‌లు: జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా)

Next Story