10వ తరగతి హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకొండి..
By అంజి
హైదరాబాద్: 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. తెలంగాణలో ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కాగా పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఒకేషనల్, ప్రైవేట్, ఓరియంటర్ విద్యార్థులకు వేరు వేరుగా హాల్‌టికెట్లను జారీ చేయనున్నారు. 10వ తరగతి పరీక్షలు రాసేవారికి కేటగిరీలుగా నాలుగు వేర్వేరు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ ఆప్షన్స్‌ను ఇచ్చారు. ఏప్రిల్ 7 నుంచి 18 వరకు 10వ తరగతి పరీక్ష పేపర్లను ఈవాల్యూషన్ చేయనున్నారు. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. www.bse.telangana.gov.in నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయి.
ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకొండి..
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ BSEని ఓపెన్ చేయండి. అందులో ఎడమ ప్యానెల్‌లో ఎస్‌ఎస్‌సీ మార్చ్ 2020 హాల్ టికెట్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. అందులో మీరు కేటగిరికి చెందితే దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ వివరాలను అందులో పొందుపరిచి.. డౌన్ హాల్ టికెట్‌పై క్లిక్ చేయండి. స్క్రీన్‌పై మీ హల్‌టికెట్ కనబడుతుంది. ఆ తర్వాత దానిని ప్రింట్ అవుట్ తీసుకొండి.