తెలంగాణలో దశల వారిగా పాఠశాలలు ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..!
By సుభాష్ Published on 29 May 2020 2:19 PM ISTతెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు దశలవారీగా తెరవాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జులై 5 వరకూ పదో తరగతి పరీక్షలు జరగనుండటంతో ఆ తర్వాతే పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఒకే సారి పాఠశాలలు ప్రారంభించకుండా మొదటిగా 8,9,10 తరగతులను ప్రారంభించి, ఆ సమయంలో ఏమైనా భద్రతాపరమైన సమస్యలు ఎదురైతే వాటిని సరిచేసి తర్వాత 6,7 తరగతులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రాథమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరవనున్నారు. 2020-21 విద్యాసంవత్సరాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలన్న దానిపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీనిపై శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.
విద్యాశాఖ ప్రణాళికలు ఇలా..
మొదటిగా కొద్ది రోజుల పాటు ఉపాధ్యాయులు విధులకు హాజరై పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేస్తారు.
ముందుగా 8,9,10 తరగతులు ప్రారంభించాలి. ఆ తర్వాత 6,7 తరగతులు, తర్వాత ప్రాథమిక పాఠశాలలు మాత్రం మరింత ఆలస్యంగా ప్రారంభించాలి.
విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుని ఒక్కో తరగతికి ఒక్కోలా విరామ సమయాన్ని కేటాయించాలి.
బడి చివరి బెల్ కొట్టిన తర్వాత అందరినీ ఒకేసారి కాకుండా 5-10 నిమిషాల వ్యవధిని పాటిస్తూ ఒక్క తరగతి విద్యార్థులను బయటకు పంపాలి.
అన్ని పాఠశాలల్లో థర్మల్ స్కీనింగ్ తప్పనిసరి
ప్రతీ విద్యార్థికి మాస్క్ తప్పనిసరి
Also Read
బ్యాంకులకు మూడు నెలల్లో 30 రోజుల సెలవులుNext Story