తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం ముఖ్యాంశాలు

By సుభాష్  Published on  9 Sep 2020 10:13 AM GMT
తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం ముఖ్యాంశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకు వచ్చింది ప్రభుత్వం. శాసన సభ సమావేశల సందర్భంగా బుధవారం చారిత్రక రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. తరతరాలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చరమగీతం పాడి రైతులకు, పేదలకు సరళీకృతమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈ సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

రెవెన్యూ చట్టంలోని ముఖ్యాంశాలు

♦ ధరణి పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి

♦ పోర్టల్‌ రెండు భాగాలుగా ఉంటుంది. అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ లాండ్‌ వివరాలు ధరణి పోర్టల్‌లో ఉంటాయి

♦ ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ధరణి వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు

♦ కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికి విచక్షణాధికారాలు ఉండవు

♦ రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే మ్యూటేషన్‌

♦ మ్యూటేషన్‌ పవర్‌ను కూడా ఆర్డీవో నుంచి తొలగించి తహసీల్దార్‌కు అప్పగిస్తాం

♦ మ్యూటేషన్‌ అయిన వెంటనే ధరణిలో అప్‌లోడ్‌ కావాలి

♦ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, పాస్‌బుక్‌, ధరణి కాపీ వెంటనే తీసుకోవచ్చు

♦ కొత్త రెవెన్యూ చట్టంతో ఇకపై ఆస్తి తగాదాలు ఉండవు

♦ ఉమ్మడి ఒప్పందం ఉంటేనే వారసత్వ భూ విభజన

♦ పాస్‌ పుస్తకాలు లేని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసీల్దార్లదే

♦ వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు పూర్తయిన వెంటనే బదిలీ చేయాలి

♦ రికార్డు పూర్తి చేసి కొన్న వారికి బదిలీ చేయాలి

♦ రుణాల మంజూరుకు పాస్‌ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు

♦ తప్పు చేసిన తహసీల్దార్‌పై బర్తరఫ్‌ క్రిమినల్‌ చర్యలు, తిరిగి భూములు స్వాధీనం

♦ రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకుంటుంది

♦ డిజిటల్‌ రికార్డు ఆధారంగానే వ్యవసాయ రుణాలు

♦ వీఆర్‌వోలను ఏదైన సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ

♦ వీఆర్‌ఎస్‌ లేదా స్వచ్చంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం

♦ రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయకూడదు

♦ కొత్త పట్టాదారు పుస్తకం హక్కుల రికార్డుగా గుర్తింపు

♦ జాతీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో రిజిస్టర్‌ చేయాలి

♦ ఇకపై సబ్‌ రిజిస్టార్‌ అధికారాలు తహసీల్దార్లకు అప్పగింత

♦ ఏ రకమైన రిజిస్ట్రేషన్‌ కోసమైనా ప్రభుత్వవెబ్‌ సైట్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి

♦ అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, అంతేకాకుండా సర్వీసు నుంచి తొలగింపు

♦ 1971 యాక్ట్‌ రద్దుతో పెండింగ్‌లో ఉన్న ఫైల్స్‌, కేసులు ట్రిబ్యూనల్‌కు

♦ విచారణ తర్వాత ట్రిబ్యూనల్‌ ఉత్తర్వులే ఫైనల్‌

Next Story