'పుర'పోరు.. రిజర్వేషన్లు ఖరారు..!

By Newsmeter.Network  Published on  5 Jan 2020 8:56 AM GMT
పురపోరు.. రిజర్వేషన్లు ఖరారు..!

హైదరాబాద్‌: 13 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. మున్సిపల్‌ ఎన్నికల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 13 కార్పొరేషన్లలో ఎస్టీ-1,ఎస్సీ-1, బీసీ-4, ఓపెన్‌-7 రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పిస్తామన యంఏయుడి డైరెక్టర్‌ శ్రీదేవి పేర్కొన్నారు. పాల్వంచ, మందమర్రి, మణుగూరు రిజర్వేషన్‌ ప్రకటించడం లేదని తెలిపారు. ఇవే రిజర్వేషన్లు తర్వాత ఎన్నికల్లో కూడా వర్తిస్తాయని శ్రీదేవి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ఆధారంగా, బీసీ రిజర్వేషన్లను బీసీ ఓటర్ల ఆధారంగా పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లు కల్పిస్తామని యంఏయుడి డైరెక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, ఓపెన్‌ కేటగిరీలో 60 మున్సిపాలిటీలు రిజర్వడ్‌ అయ్యాయని తెలిపారు..

ఎస్టీ రిజర్వుడు స్థానాలు

అమన్గల్‌, వర్ధన్నపేట, దోర్నాల్‌, మరిపెడ, డోర్నకల్‌

ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాలు

కేతనపల్లి, బెల్లంపల్లి, మధిర, పరకాల, వైరా, నస్కూరు, అలంపూర్‌, తోర్రూర్‌, నార్సింగి, పెద్ద అంబర్‌పేట, ఐజా, పెబ్బేరు, నెరుడుచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, తిరుమలగిరి

బీసీ రిజర్వుడ్‌ స్థానాలు

సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, చండూరు, భీంగల్‌, ఆందోల్‌, కొల్లపూర్‌, యాదగిరిగుట్ట, నిర్మల్‌, కిసిగి, రాయికల్‌, పోచంపల్లి, రమాయపేట, బోధన్‌, సదాశివపేట, ఆర్మూర్‌, మెటపల్లి, గద్వాల్‌, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సుల్తానాబాద్‌, నర్సంపేట, కిదంగల్‌, తుఫ్రాన్‌, ఆలేరు, భువనగిరి

మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌-ఎస్టీ రిజర్వుడ్‌, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌-ఎస్సీ రిజర్వుడ్‌, జవహర్‌నగర్‌, నిజామాబాద్‌, బండ్లగూడ జాగీర్‌, వరంగల్‌-బీసీ రిజర్వుడ్‌.

జనరల్‌ స్థానాలు: కరీంనగర్‌, బోడుప్పల్‌, ఫిర్జాదీగూడ, ఖమ్మం, నిజాంపేట్‌, బడంగ్‌పేట, గ్రేటర్‌ హైదరాబాద్‌

Next Story