కరోనా కేక్ ను నరికిన మంత్రి

By రాణి  Published on  19 April 2020 5:53 PM GMT
కరోనా కేక్ ను నరికిన మంత్రి

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ జన్మదిన వేడుకలు ఆదివారం జరిగాయి. సామాజిక దూరం పాటిస్తూనే కుటుంబ సభ్యులు, అధికారులు మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా..మంత్రి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కరోనా వైరస్ రూపంలో ఉన్న కేక్ ను కట్ చేశారు కాదు కాదు.. నరికేశారు. నరకడం ఏంటా అనుకుంటున్నారా ? సాధారణంగా ఎవరైనా పుట్టిన రోజున కేక్ కట్ చేయడం కామన్. కానీ మన మంత్రి గారి పుట్టిన రోజు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో వచ్చింది. ఇప్పటికే ప్రపంచమంతా కరోనా పై పోరాడుతోంది. మానవజాతి అంతా ఒకవైపు..కరోనా మరో వైపు అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి.

Also Read : మాకు సమోసాలు, పిజ్జాలు కావాలి.. దేశ రాజధానిలో వింత కోరికలు

కరోనాను ఎలాగైనా అంతం చేయాలని, తెలంగాణను కరోనా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న గట్టి సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు, పోలీస్ యంత్రాంగం కష్టపడుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి పుట్టినరోజు నాడు కూడా కరోనాను అంతం చేయాలని దలిచి కరోనా రూపంలో ఉన్న కేక్ ను తెప్పించారు. మంత్రి గారి చేతికి పెద్ద కత్తి ఇచ్చి..కేక్ ను నరికేయండి సార్ అంటూ చుట్టూ ఉన్నవారు అరిచారు. అంతే మంత్రిగారు కరోనా కేక్ ను నరికేశారు.

Also Read : ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై రాజకీయ రభస

Next Story
Share it