తెలంగాణ మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడ్డ మద్యం షాపులు ఇటీవల తెరిచిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉండేది. ఇక లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఆ సమయాన్ని 8 గంటల వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక తాజాగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 8.30గంటల వరకూ మద్యం షాపులు తెరిచి ఉంటాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.  ఇటీవల 8 గంటల వరకూ సమయం ఉండగా, శుక్రవారం హైదరాబాద్ లో ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సమావేశమై తాజాగా మరోసారి  సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

కాగా, రాష్ట్రంలో అర్హులైన గీత కార్మికులందరికీ శాఖాపరమైన సభ్యత్వ కార్డులను అందజేయాలన్నారు. అంతేకా సొసైటీలకు ఇచ్చే తాటి, ఈత చెట్ల కాలపరిమితిని పదేళ్ల పాటు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. (ఇది చదవండి: దేశంలోనే రెండో స్థానం: తెలంగాణలో 55 రకాల కరోనా వైరస్‌లు: జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా)

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో దాదాపు రెండు నెలల పాటు మద్యం షాపులు మూసివేశారు.  దీంతో మద్యం ప్రియులు నానా అవస్థలకు గురయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం లేక పడరాని కష్టాలను ఎదుర్కొన్నారు. నిద్రలేని రాత్రులు గడిపారు. అదే అదనుగా భావించిన కొందరు మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ మార్గాన్ని ఎంచుకుని పట్టుబడి కటకటాలపాలయ్యారు.  ఇక మద్యం ప్రియుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్రం షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ షాపులు తెరుచుకున్నాయి. ఈ ఇప్పటి నుంచి మద్యం ప్రియులకు పండగే .. పండగ. ఇక నిబంధనల ప్రకారం… మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటిస్తూ మద్యం కొనుగోలు చేస్తున్నారు.

(ఇది చదవండి: టెన్షన్ అక్కర్లేదు.. చిట్టా విప్పిన ఈటెల)

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.