హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంతో హై కోర్టు మేల్కొంది. ఇకపై అత్యాచారాల ఘటనలపై విచారణను వేగవంతం చేసేందుకు చీఫ్ జస్టిస్ ప్రత్యేక కోర్టుకు 11 న్యాయమూర్తులను నియమించారు. దీంతో ఇకనుంచి జరిగే అత్యాచార నేరాలపై ప్రత్యేక కోర్టులో దర్యాప్తు వేగంగా జరగనుంది.

గత నెల 27వ తేదీన దిశ అనే వెటర్నరీ డాక్టర్ పై నలుగురు దుండగులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, ఆపై సజీవంగా తగలబెట్టిన సంగతి తెలిసిందే. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సీన్ రీ కన్ స్ర్టక్షన్ చేస్తుండగా తిరగబడటంతో వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ నిందితుల ఎన్ కౌంటర్ పై పూర్తి విచారణ చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రస్తుతం నలుగు నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలో ఉంచారు. అయితే నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నపుడు తాము ఇంకా 9 హత్యలు చేసినట్లు చెప్పడంతో పోలీసులు మిగతా హత్యలపై దర్యాప్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

రాణి యార్లగడ్డ

Next Story