తెలంగాణ గ్రూప్‌ -4 ఫలితాలు విడుదల

By సుభాష్  Published on  6 Oct 2020 2:11 PM GMT
తెలంగాణ గ్రూప్‌ -4 ఫలితాలు విడుదల

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-4 ఫలితాలు విడుదలయ్యాయి. 2018లో విడుదలైన గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో1,595 ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను లాగిన్‌ కావచ్చు. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 30,723 నియమాకాలను చేపట్టినట్లు కార్యదర్శి వాణి ప్రసాద్‌ తెలిపారు.

అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-4 రాత పరీక్షను అక్టోబర్‌ 7,2018న నిర్వహించింది. మొత్తం 1,867 ఉద్యోగాలకు 4,80,545 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరిగాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,046 సెంటర్లు ఏర్పాటు చేశారు. రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు గానూ, కనీసం అర్హత ఓసీ-40శాతం,బీసీ -3 శాతం, ఎస్సీ, ఎస్టీ -30శాతం నిర్ధారించారు.

Next Story