తెలంగాణలో కొత్తగా 2,166 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  22 Sep 2020 3:19 AM GMT
తెలంగాణలో కొత్తగా 2,166 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,166 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,74,774 ఉండగా, మృతుల సంఖ్య 1052కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 2,143 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 1,44,073 కోలుకున్నారు. అలాగే యాక్టివ్‌ కేసుల సంఖ్య 29,649 మంది ఉన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.60 శాతం ఉండగా, దేశంలో 1.60 శాతం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

అలాగే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు.. జీహెచ్‌ఎంసీ 309, కరీంనగర్‌ 127, మేడ్చల్‌ మల్కాజిగిరి 147, నల్గొండ 113, రంగారెడ్డి 166 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

Next Story