తెలంగాణలో కొత్త కేసులు 1,891.. రికవరీ 1,878
By సుభాష్ Published on 9 Oct 2020 3:42 AM GMTతెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,891 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,08,535 ఉండగా, మృతుల సంఖ్య 1208కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,878 ఉండగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,80,953 ఉంది. ఇక మరణాల రేటు రాష్ట్రంలో 0.57 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 86.77 శాతం ఉండగా, దేశంలో 85.5 శాతం ఉన్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 26,374 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 21,801 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక ఒక రోజులోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు.. జీహెచ్‌ఎంసీ 285, మేడ్చల్ మల్కాజిగిరి 195, నల్గొండ 128, రంగారెడ్డి 175 కేసులు ఉండగా, మిగతా జిల్లాల్లో వంద లోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.