తెలంగాణ కరోనా బులిటెన్: హైదరాబాద్‌లో తగ్గుతున్న కేసులు
By సుభాష్ Published on 4 Sep 2020 4:22 AM GMTతెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2478 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. కొత్తగా కరోనాతో 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,35,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 866కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులు 32,994 ఉండగా, గడిచిన 24 గంల్లో 2011 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,02,024కు చేరింది. ఇక తెలంగాణలో కరికవరీ రేటు 75.0 శాతం ఉండగా, అదే భారత్‌లో అయితే 77.14 శాతం ఉంది.
ఇక మరణాల రేటు తెలంగాణలో 0.63 శాతం ఉండగా, భారత్‌లో 1.74 శాతంగా ఉంది. ఇక తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 267, కరీంనగర్‌లో 129, ఖమ్మం 128, మేడ్చల్ 190, నల్గొండ 135, రంగారెడ్డి 171, వరంగల్ అర్బన్ 92 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మిగితా రాష్ట్రాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో 25,730 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా, గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గతంలో హైదరాబాద్‌లో కేసులు ఎక్కువగా ఉండగా, ఇతర జిల్లాల్లో తక్కువగా నమోదయ్యేది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో తగ్గుముఖం పడుతూ, ఇతర జిల్లాల్లో కేసుల సంఖ్య పెరిగింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా ప్రజలే తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం, మాస్క్‌లు తప్పనిసరిగ్గా ధరించడం లాంటివి చేస్తే కోవిడ్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే మంచి పోషకాలున్న ఆహారం తీసుకుని ఇమ్యూనిటీ శక్తి పెంచుకోవడం వల్ల కోవిడ్ నుంచి కూడా రక్షించుకోవచ్చు.