తెలంగాణలో 2,924 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  30 Aug 2020 9:47 AM IST
తెలంగాణలో 2,924 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,924 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య1,23,090 నమోదు కాగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 818కి చేరుకుంది. ఇక భారత్‌లో మరణాల రేటు 0.66 కాగా, దేశంలో 1.79 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 461 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి 213, ఖమ్మం 181, కరీంనగర్‌ 172, నల్గొండ 171, మేడ్చల్‌ మల్కాజిగిరి 153, సూర్యాపేట 118, నిజామాబాద్‌ 140, వరంగల్‌ అర్బన్‌ 102 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదయ్యాయి.

Ts Corona Update1

Next Story