తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు ఎన్ని అంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sep 2020 12:58 AM GMTతెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు వైరస్ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1873 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963 చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 9 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 827కు చేరింది. అలాగే తాజాగా 1849 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 92,837కు చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.66శాతం ఉండగా, దేశంలో 1.78 శాతం ఉందని తెలిపింది. ఇక కోలుకున్న వారి రేటు రాష్ట్రంలో 73.3 శాతం ఉండగా, దేశంలో 76.55 శాతం ఉన్నట్లు పేర్కొంది. అలాగే హోమ్ ఐసోలేషన్‌లో 24,216 చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
ఇక అత్యధికంగా ఈ రోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో 360 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరీంనగర్‌లో 180, సంగారెడ్డి 129, ఖమ్మం 103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మిగితా జిల్లాల్ వంద లోపు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.