షాకింగ్: తెలంగాణలో కొత్తగా 107 కేసులు

By సుభాష్  Published on  28 May 2020 2:52 AM GMT
షాకింగ్: తెలంగాణలో కొత్తగా 107 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. బుధవారం రాత్రి 10 గంటలకు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి. అందులో తెలంగాణ నుంచి 39 కేసులు కాగా, 19 మంది వలస వచ్చిన వారు, మరో 49 మంది సౌదీ ఆరేబియా నుంచి వచ్చిన వారుగు గుర్తించారు. కాగా, లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో పాజిటవ్‌ కేసులు 1842 చేరగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 297 మందికి పాజిటివ్‌ వచ్చింది. కాగా, రాష్ట్రంలో మరో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 63కు చేరుకుంది. అలాగే ఇప్పటి వరకూ డిశ్చార్జ్‌ అయిన వారిసంఖ్య 1321 చేరగా, 714 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.

తెలంగాణలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులు:

తెలంగాణలో కొత్త కేసులు : 39

వలస వచ్చిన వారు : 19

సౌదీ నుంచి వచ్చినవారు :49 మంది ఉన్నారు.

తెలంగాణలో మొత్తం కేసులు: 1842

వలస వచ్చిన వారు : 173

సౌదీ నుంచి వచ్చిన వారు : 94

విదేశాల నుంచి వచ్చిన వారు : 30 మంది పాజిటివ్‌ వచ్చిన వారిలో ఉన్నారు.

కాగా, మొదట్లో కేసుల సంఖ్య తగ్గుముఖం ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన తర్వాత దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలువుతుంది. అయినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అయితే తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాకపోగా, ఒక్క హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పాజిటివ్‌ నమోదు కావడం మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది.

ఇక తాజాగా మటన్ వ్యాపారి ఇంట్లో కుటుంబ సభ్యులందరికి ఈ కరోనా పాజిటివ్‌ రావడం అధికారుల్లో టెన్షన్‌ పుడుతోంది. నగరంలోని పహడీషరీఫ్‌లో నివాసం ఉంటున్న మటన్‌ వ్యాపారి ఇంట్లో 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మటన్‌ కొనుగోలు చేసిన వాళ్లంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. వారంతా క్వారంటైన్‌ పాటిస్తున్నారు.

ప్రస్తుతం పహాడి షరీఫ్‌ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా మార్చేశారు. ఆ మటన్‌ వ్యాపారికి జియాగూడలోని బంధువుల ద్వారా వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. దీంతో జియాగూడ ప్రాంతంలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్ పరిధిలోని జియాగూడ ప్రాంతాలైన ఇందిరానగర్‌, వెంకటేశ్వరనగర్‌, దుర్గానగర్‌, మక్బరా, మేకలమండి, సబ్జిమండి, సాయిదుర్గనగర్‌, సంజయ్‌నగర్‌ బస్తీల్లో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు జియాగూడలోని అన్ని ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేశారు.

Next Story