తెలంగాణలో కొత్తగా 2511 పాజిటివ్‌ కేసులు.. 11 మంది మృతి

By సుభాష్  Published on  5 Sept 2020 10:02 AM IST
తెలంగాణలో కొత్తగా 2511 పాజిటివ్‌ కేసులు.. 11 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,511 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తంగా 11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,38,395 కేసులు నమోదు కాగా, మొత్తం 877 మంది మృతి చెందారు. ఇక తాజాగా కరోనా నుంచి 2,579 మంది కోలుకోగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,04,603 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.63 శాతం ఉండగా, దేశంలో 1.73 శాతం ఉంది. ఇక కోలుకున్నవారి రేటు రాష్ట్రంలో 75.5 శాతం ఉండగా, దేశంలో 77.24 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. అలాగే హోమ్‌ ఐసోలేషన్‌లో 25,729 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక జీహెచ్‌ఎంసీలో 305 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరీంనగర్‌ 150, ఖమ్మం 142, మేడ్చల్‌ మల్కాజిగిరి 134, నల్గొండ 170, రంగారెడ్డి 184 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదయ్యాయి.

Ts Corona

Next Story