తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్నికేసులంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2020 4:25 AM GMT
తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ విడుదల.. ఏ జిల్లాలో ఎన్నికేసులంటే..?

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులు నిత్యం 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,159 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 09 మంది మృతి చెందినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,65,003 ఉండగా, మృతుల సంఖ్య 1005కి చేరింది. రాష్ట్రంలో 30,443 కేసులు యాక్టివ్‌లో ఉండగా, గడిచిన 24 గంటల్లో కోలుకున్న వారి సంఖ్య 2,108 మంది ఉంది.

కాగా, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గితే.. మరొక రోజు కేసుల సంఖ్య పెరిగిపోతున్నారు. గతంలో హైదరాబాద్‌లో అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యేది.. ప్రస్తుతం హైదరాబాద్‌లో తగ్గుముఖం పట్టి, ఇతర జిల్లాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్ – 20

భద్రాద్రి కొత్తగూడెం- 60

జీహెచ్‌ఎంసీ -318

జగిత్యాల-45

జనగాం- 35

జయశంకర్‌ భూపాలపల్లి – 22

జోగులాంబ గద్వాల – 18

కామారెడ్డి – 49

కరీంనగర్ -127

ఖమ్మం -77

ఆసిఫాబాద్ – 13

మహబూబ్‌ నగర్ -24

మహబూబాబాద్ -84

మంచిర్యాల- 33

మెదక్ – 34

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 121

ములుగు –18

నాగర్‌కర్నూల్ – 27

నల్లగొండ – 141

నారాయణపేట -14

నిర్మల్ -29

నిజామాబాద్ – 84

పెద్దపల్లి –47

రాజన్న సిరిసిల్ల -53

రంగారెడ్డి -176

సంగారెడ్డి -64

సిద్దిపేట – 132

సూర్యాపేట- 66

వికారాబాద్‌-22

వనపర్తి –23

వరంగల్‌ రూరల్ –39

వరంగల్‌ అర్భన్ -98

యాదాద్రి భువనగిరి – 46 కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story