కౌంటింగ్‌ను ఆపేయండి : ట్రంప్ సంచలన కామెంట్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2020 9:03 AM GMT
కౌంటింగ్‌ను ఆపేయండి : ట్రంప్ సంచలన కామెంట్స్

అమెరికా ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారని విమ‌ర్శ‌లు గుప్పించారు. కొద్దిసేప‌టి క్రితం మీడియా ముందుకు వచ్చిన ట్రంప్ మాట్లాడుతూ.. నేను సుప్రీం కోర్టుకు వెళ్తున్నా.. ఎన్నికల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాలని అన్నారు.

అదే స‌మ‌యంలో ఈ ఎన్నికలను మేమే గెలవబోతున్నాంమ‌ని.. నిజంగా చెబుతున్నా.. మేమే గెలిచాం.. చట్టాన్ని సరిగ్గా ఉపయోగించి ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఆపేయాలని కోరుతున్నామ‌ని అన్నారు. అంతేకాదు భారీ విజయోత్సవానికి సిద్ధంగా ఉండాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు.

ఇదిలావుంటే.. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు క్షణక్షణానికి మారిపోతూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.. ఇప్పటివరకు బైడెన్‌కు 238 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ట్రంప్‌కు 213 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.. ఇంకా ఫలితాలు వెలువడాల్సిన రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. 270 ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన వారినే అమెరికా అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.

Next Story