ట్రంప్, మెలానియాల లవ్ స్టోరీ

By సుభాష్  Published on  24 Feb 2020 11:41 AM GMT
ట్రంప్, మెలానియాల లవ్ స్టోరీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌, కుమార్తె ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నల్‌ కూడా భారత్‌కు కూడా వచ్చారు. కాగా, ట్రంప్‌ దంపతులు భారత్‌కు వస్తున్న సందర్భంగా వీరి లవ్‌ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం. 1998 ట్రంప్‌ వయసు 52 సంవత్సరాలు. ఆమె వయసు 28 ఏళ్లు. ఇద్దరి మధ్య 24 ఏళ్ల తేడా. ఓ వ్యాపారవేత్తగా బిజినెస్‌లో రాణిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ అప్పటికే రెండో వివాహం చేసుకుని ఆమెను కూడా వదిలేసి ఉంటున్నారు. ఇప్పుడున్న భార్య మెలానియా స్లొవేనియాకు చెందిన మోడల్‌. న్యూయార్క్‌ లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్‌కు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమెను చూసిన ట్రంప్‌ మనసు పారేసుకున్నారట. అప్పటి నుంచి ఆమెను వదిలిపెట్టలేదు. మెలానియా ఎక్కడికెళితే ట్రంప్‌ అక్కడికి వెళ్లేవారట. మొదట్లో ట్రంప్‌ ప్రేమకు ఓకే చెప్పిన మెలానియా తర్వాత మళ్లీ కాదని చెప్పింది. తర్వాత మళ్లీ కంటిన్యూ చేశారట. తొలిసారిగా హోవార్డ్‌ స్టర్న్‌ టీవీ షోలో వీరి మధ్య కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.

కాగా, ప్రేమ బంధాన్ని బయటపెట్టిన ట్రంప్‌.. 2005లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాదిలో యూఎస్‌ పౌరసత్వం కూడా లభించింది. ఇక 2006లో మెలానియాకు కుమారుడు జన్మించారు. మెలానియా భాష కోవిదురాలు. స్లొవేనియా, ఫ్రెంచ్‌, సెర్బియా, ఇంగ్లీష్‌, జర్మనీ భాషల్లో మాట్లాడగలరు. ఇక మెలానియా ట్రంప్‌కు చేదుడో వాదోడుగా ఉంటారు. ఒక దశలో భార్య మెలానియా వల్ల ఈ స్థాయికి ఎదిగినట్లు కూడా ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

మెలానియా పుట్టుకతోనే అందగత్తె

1970 ఏప్రిల్‌లో జన్మించిన మెలానియా పుట్టుకతోనే అందగత్తె. చిన్నప్పటి నుంచి ఆమెకు ఫ్యాషన్‌ డిజైనింగ్ అంటే ఎంతో ఇష్టం. 16వ ఏటానే మెలానియా మోడలింగ్‌ రంగంలో అడుగు పెట్టారు. ఇంగ్లీష్‌ ప్రావీణ్యం ఉన్న ఆమె.. ఎంతో కష్టపడి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.

Next Story