విమానాశ్రయంపై దాడి చేసింది మేమే: అమెరికా
By సుభాష్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడికి పాల్పడినట్లు అమెరికా రక్షణ విభాగం స్పష్టం చేసింది. ఈమేరకు ఇరాక్ క్వడ్స్ ఫోర్ అధిపతి ఖాసీం సోలేమన్‌ను హతమార్చినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇరాక్‌లో అమెరికా అధికారులపై సోలెమన్ ప్రముఖ పాత్రపోషించినట్లు పెంటగాన్ రక్షణ శాఖ ఆరోపణలు చేసింది. అమెరికా, దాని సంకీర్ణ సేవలకు చెందిన సభ్యుల మృతికి అతనే కారణమని పేర్కొంది. దాడి జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ జాతీయ జెండాను ట్విట్టర్‌లో పోస్టు చేయడం గమనార్హం. కాగా, విదేశాల్లో ఉన్న అమెరికా అధికారులపై సోలెమన్ దాడులకు తెగబడే అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ దాడి రక్షణాత్మక చర్యగా వైట్ హౌస్ దృవీకరిచింది.
ఇక బాగ్దాద్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై రెండు రోజుల కిందట ఇరాక్ మద్దతు ఉన్న నిరసన కారులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. దీంతో ఇరాక్‌కు ప్రత్యేక బలగాలను పంపించిన ట్రంప్, సోలెమన్‌ను మట్టుబెట్టి ప్రతీకారం తీసుకుంది. సిరియా నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక కాన్వాయ్‌లు చేరుకోగా, సోలెమన్ విమానాశ్రయంలో అడుగు పెట్టిన క్షణాల్లోనే రాకెట్లతో దాడి జరిగింది. ఇక అమెరికా జరిపిన రాకెట్ల దాడిలో సోలెమన్ హతమైన కాసేపట్లోనే అమెరికా జెండాను ట్రంప్ ట్విట్టర్లో పెట్టారు. ఈ పోస్టుపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సోలెమన్‌ను మట్టుబెట్టడం ద్వారా అమెరికా ఘన విజయం సాధించిందని తెలియజేయడానికే ఆయన ట్విట్టర్‌లో ఈ విధమైన పోస్టు చేసినట్లు తెలుస్తోంది