అలా పని చేస్తేనే మంచిది.. లేకపోతే పదవులు ఊడుతాయ్: కేటీఅర్
By సుభాష్ Published on 27 Jan 2020 2:15 PM GMT
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 119 మున్సిపాలిటీలను గెలుచుకుని టీఆర్‌ఎస్ సత్తాచాటిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. గెలిచిన వారు కొత్త చట్టానికి అనుగుణంగానే పని చేయాలని, లేకపోతే పదవులు ఊడుతాయని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ రియల్టర్లు నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, ఈ విషయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా నాదే బాధ్యత అని కేటీఆర్ అన్నారు.
మణికొండ, మక్తల్ మున్సిపాలిటీల్లో బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో కొట్టుకునే పార్టీలు.. ఇక్కడ మాత్రం పొత్తు పెట్టుకుంటాయని ఆరోపించారు. కాగా, కొత్త ఆఫీషియా సభ్యుల విధానం తాము కొత్తగా తీసుకురాలేదని, చట్ట ప్రకారమే తాము ఆ విధానాన్ని ఉపయోగించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.