మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నయా ప్లాన్‌..

By సుభాష్  Published on  26 Dec 2019 7:56 PM IST
మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నయా ప్లాన్‌..

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ నయా ప్లాన్‌తోముందుకెళ్తోంది. జనవరిలో జరిగే మున్సిపల్‌ ఎన్నికలపై వ్యూహరచన చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మున్సిపాలిటీలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఏవైన ఎన్నికలు జరుగుతున్నాయంటే కేసీఆర్‌ ముందు నుంచి ప్లానింగ్‌ ఉంటుంది. మొత్తం మీద ఓటర్లను వారి వైపు తిప్పుకునేలా వ్యూహారచన చేస్తుంటారు. కాగా, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి కేటీఆర్‌... నయా ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ముందుగా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాగా, ముగ్గురు సభ్యులతో కలిసి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉంటారని సమాచారం. ప్రతి వార్డు నుంచి టికెట్‌ కోసం పోటీ పడే అభ్యర్థులను గుర్తించి అందులో గెలుపొందే అవవకాశాలున్న అభ్యర్థిని ఎంపిక చేస్తుంది ఈ కమిటీ. కేవలం అభ్యర్థులను ఎంపిక చేయడమే కాకుండా మిగితా వారు అసంతృప్తి చెందకుండా సంతృప్తి పర్చే బాధ్యత కమిటీ సభ్యులకే అప్పగించింది టీఆర్‌ఎస్‌ పార్టీ. అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకునే విధంగా పావులు కదుపుతోంది టీఆర్‌ఎస్‌ పార్టీ. మరి జనవరిలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులను కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.

Next Story